హత్యాచార బాధితురాలి తండ్రి కీలక నిర్ణయం.. అసలు విషయం తెలిస్తే కంటనీరు రావడం ఖాయం

by Gantepaka Srikanth |
హత్యాచార బాధితురాలి తండ్రి కీలక నిర్ణయం.. అసలు విషయం తెలిస్తే కంటనీరు రావడం ఖాయం
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతాలోని మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఘటనపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. పార్టీలకు అతీతంగా ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తూ.. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కూడా 24 గంటల బంద్ ప్రకటించింది. ఈ తరుణంలో బాధితురాలి తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని తిరస్కరించారు. తన కుమార్తె మరణానికి పరిహారంగా వచ్చిన డబ్బులు తీసుకుంటే అది తనను బాధిస్తుంది. అందుకే వద్దని స్పష్టంగా చెప్పాను. ఈరోజు దేశం మొత్తం నా కూతురికి న్యాయం జరుగాలని కోరుకుంటోంది. రోడ్లమీదరకు వచ్చిన అందరూ నా కూతుళ్లు, కొడుకులే. ఈ కేసు విచారణలో ఉన్నందున సీబీఐకి ఇచ్చిన వివరాలను బయట చెప్పలేను. నిందితులను త్వరలోనే గుర్తించి కఠినంగా శిక్షిస్తామని అధికారులు హామీ ఇచ్చారు అని తెలిపారు.

Advertisement

Next Story