CBI : జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసు.. నిందితుడు సంజయ్ రాయ్‌కు సైకో అనాలిసిస్ టెస్ట్

by Hajipasha |
CBI : జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసు.. నిందితుడు సంజయ్ రాయ్‌కు సైకో అనాలిసిస్ టెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో తొలుత అరెస్టయిన నిందితుడు సంజయ్ రాయ్. ఇప్పటికే అతడిని సీబీఐ టీమ్ ప్రశ్నించింది. హత్యాచారం జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోని సెమినార్ హాల్‌‌కు సంజయ్‌ను తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కూడా చేయించింది. తదుపరిగా సంజయ్‌కు సైకో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐ రెడీ అవుతోంది. సీబీఐ సూచన మేరకు ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్)కి చెందిన నిపుణుల టీమ్‌ ఒకటి కోల్‌‌కతాకు బయలుదేరింది.

ఆ టీమ్ నగరానికి చేరుకోగానే సంజయ్‌కు సైకో అనాలిసిస్ టెస్టు నిర్వహించనుంది. తద్వారా ఇప్పటివరకు అతడు చెప్పినవన్నీ వాస్తవాలా కాదా అనే దానిపై సీబీఐ అధికారులు ఒక అంచనాకు రానున్నారు. సంజయ్ రాయ్ నేపథ్యంలోకి వెళితే.. అతడొక ట్రైన్డ్ బాక్సర్. కోల్‌కతాకు చెందిన కొంతమంది సీనియర్ పోలీసు అధికారులతో ఉన్న సాన్నిహిత్యం వల్ల సంజయ్ రాయ్‌కు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోని పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద సివిక్ వాలంటీర్‌గా పోస్టింగ్ లభించింది.

Advertisement

Next Story