Kolkata: ట్రైనీ డాక్టర్ కేసులో 3డీ లేజర్ మ్యాపింగ్‌ నిర్వహించిన సీబీఐ

by S Gopi |
Kolkata: ట్రైనీ డాక్టర్ కేసులో 3డీ లేజర్ మ్యాపింగ్‌ నిర్వహించిన సీబీఐ
X

దిశ, నేషనల్ బ్యూరో: ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు విచారణను సీబీఐ వేగంగా నిర్వహిస్తోంది. ఆదివారం కోల్‌కతాలోని సీబీఐ బృందం ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డులో 3డీ లేజర్ మ్యాపింగ్ ద్వారా పరిశీలించింది. అంతకుముందు రోజు ఈ కేసు విషయంపై ప్రధాన నిందితులకు సీబీఐ మానసిక పరీక్షలను నిర్వహిచిన సంబంధిత వర్గాలు తెలిపాయి. దర్యాప్తు బృందానికి సహకరించడానికి సీబీఐకి చెందిన సైకాలజిస్ట్ కోల్‌కతాకు చేరుకుని పరీక్షలు నిర్వహించారు. మరోవైపు, ఆదివారం ఈ కేసును భారత అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో న్యామూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగష్టు 20న దీనిపై విచారణ జరపనున్నట్టు పేర్కొంది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. వివిధ రంగాలకు చెందిన పౌరులు ఆందోళనకు దిగారు. ఆదివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం వద్ద ఫుట్‌బాల్ అభిమానులు నిరసనకు దిగారు. కోల్‌కతాలో ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ వద్ద జూనియర్ డాక్టర్లు, విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story