మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఖుష్బూ

by GSrikanth |
మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఖుష్బూ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినీ నటి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూసుందర్‌ను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కేంద్రం నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నటి ఖుష్బు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఖుష్బూ ట్విట్టర్ వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ ‘మా నాయకుడు ప్రధాని మోడీ, ఎన్ సీడబ్ల్యూ చైర్ పర్సన్ రేఖశర్మ ఆశీస్సులతో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించాను.

జీవితంలోని అన్ని రంగాలలో మా దేవీలు(ఆడవారు) రక్షించబడాలని.. మీ అందరి ప్రార్థనలు, మద్దతును కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఖుష్బూసుందర్‌ను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆమెతోపాటు మమతా కుమారి, టెలీనా కంగ్ డోబ్‌లను కూడా నియమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వీరు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.

Advertisement

Next Story