- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఎంపిక చేసేది ఆయనే
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు ? అనే దానిపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కట్టబెట్టింది. ఈవిషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే సోమవారం వెల్లడించారు. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దింపాలని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఖర్గేను కోరిందని తెలుస్తోంది. మరోవైపు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా తనను అమేథీ ప్రజలు పిలుస్తున్నారంటూ పదేపదే ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నందున.. అమేథీని రాబర్ట్ వాద్రాకు కేటాయించినా ఆశ్చర్యం లేదనే అంచనాలు వెలువడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో మే 20న అమేథీ, రాయ్‌బరేలీలో పోలింగ్ జరగనుంది.ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది.