Kharge : మసీదులు, దర్గాల సర్వేలు ఆందోళనకరం : ఖర్గే

by Hajipasha |
Kharge : మసీదులు, దర్గాల సర్వేలు ఆందోళనకరం : ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో : మసీదులు, దర్గాల కింద ఆలయాలు ఉన్నాయంటూ సర్వేలు నిర్వహించే ట్రెండ్ ఆందోళన కలిగిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Kharge) అన్నారు. ఇలాంటి వివాదాస్పద విషయాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాటను కూడా వినే స్థితిలో ప్రధాని మోడీ(PM Modi), హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) లేరని ఆయన విమర్శించారు. ఎర్రకోట, తాజ్ మహల్, చార్మినార్‌లను కూల్చేసి, వాటి కింద ఏముందో చూడాలనే డిమాండ్‌ను రానున్న రోజుల్లో తెరపైకి తెస్తారేమో అని ఖర్గే వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఎస్సీ, ఓబీసీ, మైనారిటీస్, ఆదివాసీ పరిసంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. దేశ రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు అన్ని మతాలు, కులాల వారు ఏకతాటిపైకి రావాలన్నారు. మత, కులపరమైన అంశాలను తెరపైకి తెచ్చి దేశ ప్రజలను విభజించి పాలించేందుకు ప్రధాని మోడీ, బీజేపీ కుట్ర పన్నారని ఖర్గే ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed