డీకే శివకుమార్కు కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్..!

by Javid Pasha |   ( Updated:2023-05-17 17:00:53.0  )
డీకే శివకుమార్కు కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్..!
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సీఎం పోస్టు కోసం ఢిల్లీ వేదికగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ సిద్ధరామయ్య అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుండగా.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డానంటూ డీకే శివకుమార్ హైకమాండ్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపుతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఖర్గే, రాహుల్ గాంధీని కలిసిన డీకే శివకుమార్ ముందు ఆ ఇద్దరు అగ్రనేతలు రెండు ప్రతిపాదనులు పెట్టినట్లు సమాచారం.

మొదటి ప్రతిపాదన

సిద్ధరామయ్యను సీఎంగా చేస్తే డీకే ఒక్కరినే డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయడం. అలాగే కర్ణాటక పీసీసీ చీఫ్ గా డీకేను కొనసాగించడం. అలాగే తనకు నచ్చిన ఆరుగురికి మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశాన్ని డీకే కి ఇవ్వడం. అయితే ఈ ప్రతిపాదనకు డీకే ఒప్పుకోలేదని తెలుస్తోంది.

రెండో ప్రతిపాదన

ఖర్గే, రాహుల్ పెట్టిన రెండో ప్రతిపాదన సీఎం పదవిని ఇద్దరి మధ్య పంచడం. ఐదేళ్ల కాలానికి గానూ మొదటి రెండేళ్లు సిద్ధరామయ్యను సీఎంగా చేయడం.. ఇక మిగిలిన మూడేళ్లు డీకే శివకుమార్ ని సీఎంగా కొనసాగించడం. అయితే ఈ ప్రతిపాదనకు అటు సిద్ధరామయ్య గానీ, ఇటు డీకే శివకుమార్ గానీ ఒప్పుకోలేదని సమాచారం.

Advertisement

Next Story