Canada: హిందువులపై ఖలిస్థానీల దాడి.. వైరల్ అవుతోన్న వీడియో

by Rani Yarlagadda |
Canada: హిందువులపై ఖలిస్థానీల దాడి.. వైరల్ అవుతోన్న వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: కెనడాలో (Canada) హిందూ భక్తులపై (Hindu Devotees) ఖలిస్థానీలు దాడికి పాల్పడ్డారు. బ్రాంప్టన్ లోని హిందూ సభా (Hindu Sabha Temple)మందిర్లోని భక్తులపై ఖలిస్థానీలు దాడి చేయగా.. ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. దేశంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటులేదన్న ఆయన.. ప్రతి దేశ పౌరుడు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందని తెలిపారు. హిందువులపై జరిగిన దాడి ఘటనపై దర్యాప్తు చేయడంలో శరవేగంగా స్పందించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

కాగా.. హిందువులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వీడియోను స్థానికులతో పాటు.. ఎంపీలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. వీడియోలో చూస్తే.. ఆలయం వెలుపల ఖలిస్థానీ ఫేవర్ గ్రూప్స్ తో ఉన్న జెండాలు కనిపిస్తాయి. అక్కడ కర్రలతో పిల్లలు, మహిళలపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. శాంతియుతంగా ఎవరైనా నిరసన తెలుపవచ్చు కానీ.. ఇలాంటి హింసాత్మక చర్యలను సహించబోమన్నారు పీల్ ప్రాంతీయ పోలీసు చీఫ్ నిషాన్ దురైయప్ప. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story