- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TVK Mahanadu: రాజకీయాలపై దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తమిళ వెట్రి కజగం పార్టీ తొలి మహానాడు(TVK Mahanadu)లో ఆ పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటులు దళపతి విజయ్(Thalapathy Vijay) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు పాము లాంటివని అన్నారు. పార్టీలో అందరూ సమానమేనని భారీగా తరలివచ్చిన అభిమానులకు స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో చిన్నపిల్లాడినే కావొచ్చు కానీ ఎవరికీ భయపడేది లేదన్నారు. సినిమాల కంటే రాజకీయాలపైనే తాను ఎక్కువ దృష్టి పెడతానని చెప్పారు. తమిళనాడు(Tamil Nadu)లో ఒక్క బీజేపీ(BJP) మినహా అన్నీ ఒకే తరహా అనుకోవచ్చు. కానీ, ఎవరి విధానం వారికి ఉందని అన్నారు.
అంతేకాదు.. ఈ సభలో తన పార్టీ భావజాలాన్ని విజయ్(Thalapathy Vijay) ప్రకటించారు. ఆయన కూడా డీఎంకే(DMK) బాటలో పయనిస్తున్నట్లు సంకేతం పంపించారు. ఒకటే కులం.. ఒకరే దేవుడు అనేదే తన విధానమని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. టీవీకే మహానాడుకు తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రధాన పార్టీలకు వచ్చిన మాదిరి లక్షలాదిగా వచ్చారు. ఈ బల ప్రదర్శనతో ప్రధాన పార్టీలకు తాను కూడా బలమైన పోటీ దారుడినేనని విజయ్(Thalapathy Vijay) సంకేతం పంపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.