Bhatti Vikramarka: విద్వేషాలను రగిలించే వారికి దేశాన్ని ఇవ్వకూడదు

by Gantepaka Srikanth |
Bhatti Vikramarka:  విద్వేషాలను రగిలించే వారికి దేశాన్ని ఇవ్వకూడదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అదానీ, అంబానీల దోపిడీ వ్యవస్థకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. జార్ఖండ్(Jharkhand) రాష్ట్రం రాంఘర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ మీటింగ్‌లో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అదానీ, అంబానీ వంటి కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్ట్ నుంచి జార్ఖండ్‌కు విముక్తి కల్పించాలని కోరారు. ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఏఐసీసీ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా జోడో యాత్ర చేసి దేశంలోని ప్రజాస్వామిక శక్తులను ఏకం చేశారని అన్నారు. విద్వేషాలను రగిలించే వారికి దేశాన్ని ఇవ్వకూడదనే లక్ష్యంతో రాహుల్ ఉన్నారన్నారు.

విశాల భారతదేశంలో ప్రేమ అనే దుకాణం తెరిచి అన్ని జాతులు, మతాలకు సమాన అవకాశాలు ఇవ్వాలనేది రాహుల్ టార్గెట్ అన్నారు. దేశంలోని వనరులు, సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశ ప్రజలకే చెందాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే ఝార్ఖండ్ వనరులు రక్షించబడతాయని అన్నారు. ఈ దేశ సంపద జనాభా నిష్పత్తికి అనుగుణంగా పంపిణీ జరగాలి అంటే రాజ్యాంగాన్ని రక్షించుకొని ముందుకు పోవాలన్నారు. ఇది కేవలం ఇండియా కూటమితోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు గులాం అహమద్ మీర్, ఏఐసీసీ సెక్రటరీ సిరివెళ్ల ప్రసాద్, ఝార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కేశవ్ కమలేష్ మహతో, షహ్ నాజ్ అన్వర్, మైనారిటీ సెల్ అధ్యక్షులు తారీక్ అన్వర్, షకీల్ అహ్మద్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed