35 ఏళ్ల వరకు బీజేపీని ఎవరూ తాకలేరు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
35 ఏళ్ల వరకు బీజేపీని ఎవరూ తాకలేరు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేపీ నడ్డాతో పాటు అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. దేశంలో మరో 25 ఏళ్ల పాటు బీజేపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. మరో 35 ఏళ్ల పాటు ఎవరూ తాకలేరు అని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా అధికారంలోకి రాగల సత్తా ఇప్పుడు బీజేపీ ఉందని అన్నారు. అంతకుముందు అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు.

Advertisement

Next Story