- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలికపై కన్నతండ్రి లైంగిక వేధింపులు.. మూడు జీవితఖైదులు విధించిన కోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: బాలికపై లైంగిక వేధిపులకు పాల్పడ్డ కన్నతండ్రికి జీవితఖైధు విధించింది కేరళ కోర్టు. ఈకేసుని విచారించిన కోర్టు.. దోషికి మూడు జీవితఖైదులను విధించింది. బాలిక తల్లి గల్ఫ్ లో పనిచేస్తుండగా.. తండ్రితో కలిసి ఆమ అమ్మమ్మ ఇంట్లో నివసించేంది. బాలికకు మొబైల్ చూపిస్తానని ఆశ చూపించి.. గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
గత ఏడాది జూలైలో ఈ ఘటన జరిగింది. తన ఆరేళ్ల కూతురుపై నలభై ఏళ్ల వ్యక్తి ఇలా పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తిరువనంతపురంలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టున్యాయమూర్తి ఆర్ రేఖ నిందితుడైన తండ్రికి అత్యాచారం, పోక్సో ఇతర చట్టాల కింద శిక్షను ఖరారు చేశారు. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి దారుణాలకు పాల్పడటం ‘తండ్రిపై ఉన్న నమ్మకానికి’’ మాయని మచ్చ అని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలి బాల్యాన్ని లాక్కున్న ఇలాంటి నేరాలను సమర్థించలేమని పేర్కొంది. అంతేకాకుండా దోషికి రూ.90 వేల జరిమానా విధించింది కోర్టు.
అయితే, ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి దోషి కేవలం జీవిత ఖైదుని మాత్రమే అనుభవిస్తారని ప్రాసిక్యూటర్ చెప్పారు. మొబైల్ నెపంతో బాధితురాలని గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడని ఆయన తెలిపారు. బాలిక అస్వస్థతకు గురైనప్పుడు ఈ విషయాన్ని తన అమ్మమ్మకు తెలిపింది. దీంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఇకపోతే, తన తండ్రి తాగి వచ్చినప్పుడు తనతోనూ అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధితురాలి 15 ఏళ్ల సోదరి కూడా కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈఏడాది మార్తి 29న ఈ కేసు విచారణ ప్రారంభం కాగా.. కేవలం నెలరోజుల్లోనే శిక్షపడటం గమనార్హం.