రిజర్వ్‌లో 7 బిల్లులు : గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయించిన సర్కారు

by Hajipasha |   ( Updated:2024-03-23 11:41:56.0  )
రిజర్వ్‌లో 7 బిల్లులు : గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయించిన సర్కారు
X

దిశ, నేషనల్ బ్యూరో : గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ నిర్ణయాలను తప్పుపడుతూ కేరళలోని సీపీఎం సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తేవాల్సిన ఏడు బిల్లులను గవర్నర్ వెంటనే ఆమోదించకుండా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిశీలనకు పంపించి కాలయాపన చేస్తున్నారని కేరళ ప్రభుత్వం ఆరోపించింది. గవర్నర్ తీరు ఏకపక్షంగా ఉందని పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ అకారణంగా నిరవధికంగా పెండింగ్‌లో ఉంచడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని వాదన వినిపించింది. మొత్తం 7 బిల్లులను గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ దాదాపు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంచారని సుప్రీంకోర్టుకు రాష్ట్ర సర్కారు తెలియజేసింది.

Advertisement

Next Story

Most Viewed