- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండియా, ఎన్డీఏ కూటమికి వచ్చే MP సీట్లు ఎన్నో తేల్చిచెప్పిన CM కేజ్రీవాల్
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటి వరకు ఆరు ఫేజ్‌ల పోలింగ్ పూర్తి అయ్యింది. జూన్ 1వ తేదీన ఏడో దశ పోలింగ్ జరగాల్సి ఉంది. జూన్ 4వ తేదీన దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది అన్నా ఉత్కంఠకు తెర దిగనుంది. ఈ క్రమంలో ఎన్డీఏ, ఇండియా కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 400 సీట్లు సాధించి హ్యాట్రిక్ కొడతామని బీజేపీ బలంగా ప్రచారం చేసుకుండగా.. ఈ సారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఇండియా కూటమి అంటోంది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, ఇండియా కూటమికి వచ్చే సీట్లు ఎన్నో కుండబద్దలు కొట్టారు. ఇండియా కూటమికి 300 సీట్లు, ఎన్డీఏ కూటమికి 200 సీట్లు వస్తాయని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. బీజేపీకి 400 సీట్లు వచ్చే ఛాన్సే లేదని ఈ సంద్భరంగా ఢిల్లీ సీఎం తేల్చి చెప్పారు.