కేజ్రీవాల్‌కు మరోసారి సమన్లు: ఈ నెల 26న విచారణకు రావాలని ఆదేశాలు

by samatah |
కేజ్రీవాల్‌కు మరోసారి సమన్లు: ఈ నెల 26న విచారణకు రావాలని ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈడీ గురువారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 26న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. గతంలో ఆరు సార్లు సమన్లు పంపగా వాటిని తిరస్కరించిన కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ చర్యలు రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపించారు. సమన్లు చట్టవిరుద్ధమైనవని పేర్కొన్నారు. దీంతో ఈ సారైనా హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. కాగా, కేజ్రీవాల్ ఆరోసారి సమన్లను దాటవేయడంతో ఈడీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు ఫిబ్రవరి 17న కోర్టులో హాజరుకావాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది. అయితే, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆయన హాజరుకాలేదు. దీంతో మార్చి16 హాజరయ్యేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేయడం గమనార్హం.

Advertisement

Next Story