ఈడీ విచారణకు ఏడోసారీ కేజ్రీవాల్ గైర్హాజరు

by samatah |
ఈడీ విచారణకు ఏడోసారీ కేజ్రీవాల్ గైర్హాజరు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరయ్యారు. సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈ నెల 22న ఏడో సారి సమన్లు జారీచేసింది. అయితే కేజ్రీవాల్ ఇన్వెస్టిగేషన్‌కు వెళ్లడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు హాజరుకావడం లేదని పేర్కొంది. ప్రతి రోజూ నోటీసులు పంపే బదులు కోర్టు నిర్ణయం కోసం ఈడీ వేచి చూడాలని వెల్లడించింది. మార్చి16న కోర్టులో విచారణకు రానున్నట్టు తెలిపింది. ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకురావొద్దని.. ఎన్ని కుట్రలు చేసినా ఇండియా కూటమిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కాగా, కేజ్రీవాల్‌ ఈడీ పంపిన అన్ని సమన్లను తిరస్కరించడం గమనార్హం. ఆరో సారి నోటీసులు తిరస్కరించడంతో ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనంతరం వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేజ్రీవాల్ కోర్టు విచారణకు హాజరయ్యారు. మార్చి 16 మరోసారి కోర్టులో దీనిపై విచారణ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed