నలుగురికి కీర్తి చక్ర,18 మందికి శౌర్య చక్ర.. గ్యాలంటరీ అవార్డ్స్ ప్రకటించిన కేంద్రం

by vinod kumar |
నలుగురికి కీర్తి చక్ర,18 మందికి శౌర్య చక్ర.. గ్యాలంటరీ అవార్డ్స్ ప్రకటించిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ బలగాలు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సిబ్బందికి 103 శౌర్య పురస్కారాలను ప్రకటించారు. ఇందులో నాలుగు కీర్తి చక్ర, 18 శౌర్య చక్ర అవార్డ్స్ ఉన్నాయి. ఇద్దరు వీర వైమానిక దళ సైనికులకు శౌర్యచక్ర, ఆరుగురు సైనికులకు వాయుసేన పతకం లభించాయి. మరణానంతరం 9 మందికి పురస్కారాలను ప్రకటించారు. వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వెర్నాన్ డెస్మండ్ కీనే వీఎం ఫ్లయింగ్ (పైలట్)కి రాష్ట్రపతి శౌర్య చక్రను ప్రదానం చేశారు. అలాగే వింగ్ కమాండర్ జస్ప్రీత్ సింగ్ సంధుకు వాయు సేన మెడల్ లభించింది. 19వ బెటాలియన్ రాష్ట్రీయ రైఫిల్స్ కి చెందిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, 63కి చెందిన రైఫిల్‌మ్యాన్ రవి కుమార్, జమ్మూ కశ్మీర్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయున్ ముజమ్మిల్ భట్‌లకు కీర్తి చక్ర అవార్డు గ్రహీతలు దక్కాయి. శౌర్య చక్ర అవార్డు గ్రహీతలలో 666 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్‌కు చెందిన కల్నల్ పవన్ సింగ్, మేజర్ సీవీఎస్ నిఖిల్, మేజర్ ఆశిష్ ధోంచక్ (మరణానంతరం), మేజర్ త్రిపాత్‌ప్రీత్ సింగ్, సహిల్ సింగ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed