- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హత్రాస్‌ను సందర్శించనున్న రాహుల్: కేసీ వేణుగోపాల్
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో మృతులు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హత్రాస్‌లో పర్యటించే అవకాశం ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం తెలిపారు. తొక్కిసలాట గురించి మాట్లాడిన ఆయన, ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం. బాధితులు, వారి కుటుంబాలతో మాట్లాడటానికి, వారికి సానుభూతి తెలియజేయడానికి హత్రాస్‌ను రాహుల్ గాంధీ సందర్శించాలని యోచిస్తున్నారని వేణుగోపాల్ తెలిపారు.
అంతకుముందు ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే వేణుగోపాల్, సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు, వారికి ఉత్తమ చికిత్స అందించేలా చూడాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 121కు చేరుకుంది. ప్రాథమిక విచారణ ప్రకారం, ' భోలే బాబా ' నుండి ఆశీర్వాదం కోసం భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట సంభవించింది. ఘటన అనంతరం భోలే బాబా మాట్లాడుతూ హత్రాస్‌లోని 'సత్సంగ్' వేదిక నుంచి తాను బయటకు వెళ్లిన తర్వాత తొక్కిసలాట చెలరేగిందని చెప్పారు. తొక్కిసలాట జరగడానికి ఇతర సామాజిక వ్యతిరేక అంశాలు కూడా కారణమని అన్నారు. ప్రస్తుతం భోలే బాబాగా పేరొందిన జగత్ గురు సాకార్ విశ్వహరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.