- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిన్న కవిత.. త్వరలో కేజ్రీవాల్.. సీబీఐ నెక్ట్స్ అరెస్టు ఆయనదే!
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉండగా.. గురువారం ఆమెను సీబీఐ అరెస్టు చేసింది. దీంతో సీబీఐ తదుపరి టార్గెట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే అనే టాక్ వినిపిస్తోంది. కవితను అరెస్టు చేసేందుకు అనుసరించిన చట్టపరమైన ప్రక్రియనే కేజ్రీవాల్ అరెస్టుకు కూడా సీబీఐ అనుసరించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన సరిగ్గా వారం రోజుల తర్వాత(మార్చి 21న) .. సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. గత నెలలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై వాదనల్లోనూ సీబీఐ తరఫు న్యాయవాది కీలకమైన అంశాలను ప్రస్తావించారు. సిసోడియా బెయిల్ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన సీబీఐ.. ఈ కేసులో త్వరలో మరిన్ని ‘హై ప్రొఫైల్ అరెస్టులు’ జరిగే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కస్టడీ గడువు ముగిసేలోగా ఆయనను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
వాట్సాప్ ఛాట్‌లు, నిందితుల వాంగ్మూలాలు..
ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న కవితను విచారించిన తర్వాత.. గురువారం రోజు ఆమెను సీబీఐ అరెస్టు చేసింది. కవితను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరింది. ఢిల్లీలో వ్యాపారం ప్రారంభించడానికి సహాయం కోరుతూ ఒక మద్యం వ్యాపారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారని న్యాయస్థానానికి సీబీఐ తరఫు న్యాయవాది తెలియజేశారు. దీనికి సంబంధించిన వాట్సాప్ ఛాట్‌లు, సంబంధిత నిందితుల వాంగ్మూలాలు సహా తగిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని సీబీఐ పేర్కొంది. రానున్న రోజుల్లో ఇదే అంశాన్ని హైలెట్ చేసి.. సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. దేశ రాజధానిలో మద్యం షాపుల ఏర్పాటుకు అక్రమ మార్గంలో లైసెన్సులను మంజూరు చేయడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు అందాయనే అభియోగాలను ఈడీ ఇప్పటికే వినిపిస్తోంది.