Kashmiri Students: కర్ణాటకలో కశ్మీరీ విద్యార్థులకు కళాశాల వేధింపులు.. సీఎం కు లేఖ రాయడంతో..

by Y.Nagarani |
Kashmiri Students: కర్ణాటకలో కశ్మీరీ విద్యార్థులకు కళాశాల వేధింపులు.. సీఎం కు లేఖ రాయడంతో..
X

దిశ, వెబ్ డెస్క్: కాశ్మీర్ కు చెందిన పలువురు విద్యార్థులు (Kashmiri Students) కర్ణాటకలోని హసన్ జిల్లాలో (Hasan District) ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో చదువుతున్నారు. అయితే వారంతా కాలేజీలో తరగతులకు రావాలంటే గడ్డం తీయాలని, లేదా ట్రిమ్మింగ్ చేసుకోవాలని కళాశాల యాజమాన్యం ఆదేశించింది. దీనిపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం చెప్పినట్లు చేయకపోతే.. చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. 24 మంది కశ్మీరీ విద్యార్థులను కాలేజీ యాజమాన్యం.. క్లీన్ షేవ్ చేసుకోవాలని లేదా 01 ట్రిమ్మింగ్ చేసుకోవాలని ఆదేశించింది. తమను క్లినికల్ సెషన్స్ కు అనుమతించకపోవడం.. తమ భవిష్యత్తుకే దెబ్బ అని వాపోయారు. ఇది తమ హాజరు, రికార్డులపై ప్రభావం చూపుతుందన్నారు. దీనిపై విద్యార్థి సంఘం సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాయగా.. ఆయన సమస్యను పరిష్కరించారు.

విద్యార్థుల సాంస్కృతిక, మతపరమైన హక్కులను కాదనడం.. తాము చెప్పిందే చేయాలనడం సరికాదని విద్యార్థి సంఘం లేఖలో పేర్కొంది. అయితే విద్యార్థులు మతపరమైన ప్రార్థనల కోసం తరచూ తరగతులకు గైర్హాజరవుతున్నారని క్లినికల్ ఇన్ స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. విద్యార్థి సంఘం సీఎంకు లేఖ రాయడంతో.. కాలేజీ అడ్మినిస్ట్రేషన్ కశ్మీరీ విద్యార్థులతో సమావేశం నిర్వహించి.. ఎలాంటి పరిణామాలు లేకుండా మతపరమైన ఆచారాలను పాటించేందుకు అంగీకరించింది.

Advertisement

Next Story

Most Viewed