- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jammu & Kashmir: ఉగ్రదాడిలో కశ్మీర్ పండిట్ మృతి
శ్రీనగర్: Kashmiri pandit shot dead by Terrorist attack in Jammu & Kashmir| జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియన్ జిల్లాలో మంగళవారం ముష్కరులు కశ్మీర్ పండిట్ ను కాల్చి చంపారు. అతని సోదరుడిపై కూడా కాల్పులకు పాల్పడగా, తీవ్ర గాయాలపాలైనా అతడిని ఆసుపత్రికి తరలించారు. మరణించిన వ్యక్తిని సునీల్ కుమార్‌గా గుర్తించారు. ఘటన తర్వాత అప్రమత్తమైన బలగాలు వెంటనే ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా ఘటనను జమ్ముకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సాజద్ లోన్ ఖండించారు. షోపియన్‌లో పిరికి ఉగ్రవాదులు మరో దాడి చేశారని అన్నారు. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కశ్మీర్ పండిట్లకు భద్రత లేకుండా పోయిందని అన్నారు.
జమ్ముకశ్మీర్ లో బీజేపీ నియమించిన పాలక వర్గం విఫలమైందని అన్నారు. ఈ ఘటనలకు ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ సమాధానమివ్వాలని ప్రశ్నించారు. కశ్మీర్ పండిట్లు భయం గుప్పిట్లో బతుకుతున్నారని అన్నారు. ఇప్పటికే 5వేలకు పైగా కశ్మీరీ పండిట్ ఉద్యోగులు దాడుల భయంతో తమ విధులకు హాజరు కావట్లేదు. పరిస్థితులు సద్దుమణిగే వరకు ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేయాలని కోరుతున్నారు. గత వారం కూడా వలసకూలీని ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: రేపటి నుండి రూ. 2 పెరుగనున్న ఆ రెండు కంపెనీల పాల ధరలు!
- Tags
- Jammu & Kashmir