Kashmir elections: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తాం.. నేషనల్ కాన్ఫరెన్స్ హామీ

by vinod kumar |
Kashmir elections: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తాం.. నేషనల్ కాన్ఫరెన్స్ హామీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సోమవారం తన మేనిఫోస్టోను రిలీజ్ చేసింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. అంతేగాక 2000లో జమ్మూ కశ్మీర్ శాసనసభ ఆమోదించిన స్వయంప్రతిపత్తి తీర్మానాన్ని పూర్తి అమలు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొంది. భూమి లేనివారికి, ఎక్కువ కాలం పాటు అంతరాయం లేకుండా ప్రభుత్వ భూములను కలిగి ఉన్నవారికి భూమిని అందించడానికి ఒక విధానాన్ని రూపొందిస్తామని వెల్లడించింది. వారికి యాజమాన్య హక్కులను మంజూరు చేస్తామని పేర్కొంది. అలాగే భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య చర్చలను ప్రోత్సహిస్తామని , జైళ్లలో మగ్గుతున్న ఖైదీల విడుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోపై బీజేపీ నేత కవీందర్ గుప్తా స్పందిస్తూ.. ఖైదీలను విడుదల చేయడం, ఆర్టికల్ 370ని పునరుద్ధరించడంపై పార్టీకి నియంత్రణ లేదని తెలిపారు. ప్రజలను దోపిడీ చేసి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.

Advertisement

Next Story