Karnataka: భార్య కోసం ఎన్నికల ప్రచారంలోకి దూకిన స్టార్ హీరో.. కేవలం ‘OG’ కోసమేనని క్లారిటీ!

by Shiva |
Karnataka: భార్య కోసం ఎన్నికల ప్రచారంలోకి దూకిన స్టార్ హీరో.. కేవలం ‘OG’ కోసమేనని క్లారిటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. అయితే, ఆ ఫీవర్ ఇప్పుడు కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌ సైతం వెంటాడుతోంది. తాజాగా, లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా శివమొగ్గ ఎంపీ స్థానం నుంచి శివన్న భార్య గీత పోటీ చేయబోతోంది. అయితే, ఆమె గెలుపు కోసం భర్తగా శివరాజ్‌కుమార్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇంకేదో ఆశిస్తున్నారని తాను భావిస్తున్నానని తెలిపారు. తనను నటుడిగా కాకుండా గీత భర్తగా చూడాలని ప్రజలను కోరినట్లుగా ఆయన వెల్లడించారు. ఆమె కోసం ఓటు అడిగేందుకు ప్రజల మధ్యలోకి వచ్చానని స్పష్టం చేశారు. Only for Geetha (OG) నినాదంతో ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నానని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన భార్యకు ఓటు వేయాలంటూ హీరో శివరాజ్‌కుమార్ ప్రజలను అభ్యర్థించారు.





Advertisement

Next Story