Siddaramaiah : కోవిద్ వైద్యపరికరాల స్కాంపై కర్ణాటక సర్కార్ నజర్

by M.Rajitha |
Siddaramaiah : కోవిద్ వైద్యపరికరాల స్కాంపై కర్ణాటక సర్కార్ నజర్
X

దిశ, వెబ్ డెస్క్ : కోవిద్(Covid-19) సమయంలో వైద్యపరికరాల కొనుగోలులో జరిగిన స్కాంపై కర్ణాటక సర్కార్ దృష్టి పెట్టింది. కోవిద్ సమయంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. స్థానికంగా ఒక్కో పీపీఈ కిట్(PPE Kit) రూ.334లకే దొరుకుతున్నప్పటికీ.. చైనా, హాంకాంగ్ సంస్థల నుంచి రూ.2100కు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అవకతవకలపై సిద్దరామయ్య(Siddaramaiah) ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. ఈ అంశాన్ని కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తోందని, కమిటీ తుది నివేదిక ఇచ్చిన అనంతరం ప్రత్యేక దర్యాప్తు జరిపించేందుకు సిద్ధం అవుతున్నాం అని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలకు భయపడేది లేదని మాజీ సీఎం యడ్యూరప్ప(Yadiyurappa) తెలిపారు. కోవిద్ సమయంలో జరిపిన ఖర్చుపై జస్టిస్ కున్హా కమిషన్ విడుదల చేసిన నివేదిక ఆధారంగా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed