బీజేపీకి జగదీష్ షెట్టర్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరుతారని ఊహగానాలు

by Hamsa |
బీజేపీకి జగదీష్ షెట్టర్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరుతారని ఊహగానాలు
X

బెంగళూరు: బీజేపీకి కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్ షాకిచ్చారు. ఆదివారం ఆయన కాషాయ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. శనివారం రాత్రి కర్ణాటక ఎన్నికల ఇంఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లద్‌తో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తనను బుజ్జగించేందుకు వచ్చిన నేతలు టికెట్ నిరాకరించడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదని షెట్టర్ అన్నారు. తన కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయించి, తనకు ఏదైనా ఉన్నత పదవి ఇస్తామని ప్రధాన్ చెప్పారని తెలిపారు.

దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన ఇలా చూడటం బాధ కలిగిస్తోందని చెప్పారు. పార్టీ తనను విస్మరించడం అసహనానికి గురి చేసిందని, దాంతో సవాల్ కు సిద్ధమయ్యాయన్నారు. అయితే తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. కాగా, ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు షెట్టర్ తిరిగి బీజేపీలోకి వస్తామని మాజీ సీఎం యడియూరప్ప అన్నారు. ఆయనకు ఏం అన్యాయం చేశామని ప్రశ్నించారు. వెళ్లాలనుకుంటే వెళ్లమని చెప్పారు. షెట్టర్‌కు పార్టీ ఉన్నత అధికారాన్ని కట్టబెట్టాలని చూస్తే స్వంత నిర్ణయం తీసుకున్నారని బీజేపీ వర్గాలు ఆరోపించాయి.

Advertisement

Next Story

Most Viewed