ముడా కుంభకోణం.. విచారణ కోసం కమిషన్ ఏర్పాటు

by Shamantha N |
ముడా కుంభకోణం.. విచారణ కోసం కమిషన్ ఏర్పాటు
X

దిశ, నేషనల్ బ్యూరో: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంపై దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతికి ఇచ్చిన కొన్ని ప్లాట్లతో సహా భూములు కోల్పోయిన వారికి మోసపూరిత ప్లాట్లు కేటాయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంది. విచారణ చేపట్టేందు ఏక సభ్య న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ కు కర్ణాటక హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పీఎన్ దేశాయ్ నేతృత్వం వహిస్తారు. ‘కేసును క్షణ్ణంగా విచారించాక.. నిజంయ బయటకు వస్తుందని ఆసిస్తున్నా’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. ముడా ద్వారా తన భార్యకు భూ కేటాయింపులు జరగలేదన్న ఆరోపణలను సిద్ధరామయ్య ఖండించారు. "మా భూమిని ముడా అక్రమంగా తీసుకుంది. ఇందుకు నా భార్య పరిహారం లేదా భూమి కోసం అర్హురాలు" అని సిద్ధరామయ్య గతంలో చెప్పారు. తనపై, కర్ణాటక సర్కారుపై బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ముడా కుంభకోణం

సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్ లో 38,283 చదరపు అడుగుల ప్లాట్ ని ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్‌ మార్కెట్‌ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది. మరోవైపు, 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ గత వారం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కేసరే గ్రామంలో మూడెకరాలకు పైగా ఉన్న వ్యవసాయ భూమి తమదే అని నిరూపించడంతో ఆయన విఫలమయ్యాయడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇకపోతే, పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున్ పై మరో ఫిర్యాదు దాఖలైంది. ప్రభుత్వం, రెవెన్యూ శాఖ అధికారుల సహకారంతో 2004లో మల్లికార్జున్ అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అందులో పేర్కొన్నాడు. దీంతో, కోట్లాది రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపించాడు.

Advertisement

Next Story

Most Viewed