మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

by Javid Pasha |
మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కొందరు వ్యక్తులు సింగపూర్ లో వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. అయితే ఆ వ్యక్తులు ఎవరనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

కాగా డీకే శివకుమార్ వ్యాఖ్యలతో కర్ణాటకలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాగా ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లతో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ.. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ లను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.

Advertisement

Next Story