బీజేపీది 40 పర్సెంట్ లవ్.. కర్ణాటక కాంగ్రెస్ సెటైరికల్ విషెస్

by Vinod kumar |
బీజేపీది 40 పర్సెంట్ లవ్.. కర్ణాటక కాంగ్రెస్ సెటైరికల్ విషెస్
X

బెంగళూరు: ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు తామెం తక్కువ కాదన్నట్లు కర్ణాటక కాంగ్రెస్ వ్యంగ్యంగా బీజేపీపై ఆస్త్రాలు సంధించింది. బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమిషన్ అంటూ పార్టీ తరుఫున వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతూ కర్ణాటక కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 'బీజేపీ నేతలు స్వచ్ఛమైన 40 శాతం ప్రేమికులు. 40 శాతం కమిషన్‌పై వారి ప్రేమ రోమియో జ్యులియెట్ ప్రేమను మించింది. బీజేపీకి ప్రతి సారి 40 శాతంపైనే ధ్యాస' అని ట్వీట్ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నలిన్ కుమార్ కటిల్‌పైన సెటైర్లు వేసింది. బీజేపీ వాళ్లకు ఆవులపై ప్రేమ లేదంటూ ట్వీట్ లో పేర్కొంది. బీజేపీ ఎంపీ తేజస్వీ యాదవ్ పైన సెటైరికల్ గా వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Next Story