- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సౌత్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలి- వివాదం రేపుతున్న కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణాదికి రావాల్సిన నిధులను ఉత్తర భారతానికి మళ్లిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకకు కేంద్రం నుంచి తగినన్ని నిధులు అందడం లేదన్నారు. సౌత్ స్టేట్స్ ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. దీంతో డీకే సురేష్ వ్యాఖ్యలపై వివాదం రేగింది.
కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందిచారు. కాంగ్రెస్ పార్టీకి విభజించు, పాలించు చరిత్ర ఉందని.. అదే ట్రిక్ ఇప్పుడు సురేష్ ప్లే చేస్తున్నారన్నారు. ఎన్డీఏ హాయంలో కర్ణాటలకు పన్నుల పంపిణీ ఎళా పెరిగిందే తెలిపే డేటాను ఉదాహరించారు.
ఓవైపు రాహుల్ జోడో యాత్రలతో దేశాన్ని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు దేశాన్ని విడగొట్టాలని మరో ఎంపీ అక్కడే ఉన్నారని విమర్శించారు. విభజించి పాలించాలన్న కాంగ్రెస్ ఆలోచన.. వలసవాదులు అనుసరించిన దానికంటే ఘోరంగా ఉందని ట్వీట్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ముక్త్ భారత్ ఫలించేలా చూస్తామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన సమాధానం ఇస్తామన్నారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన ఓ ఎంపీ ఇలా మాట్లాడటం కాంగ్రెస్ విభజన ఆలోచనను తెలియజేస్తోందని అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ప్రజలు తమను నిర్లక్ష్యానికి గురిచేస్తున్నట్లు ఆలోచిస్తున్నారన్నారు. భారతీయులంతా ఒకటని అన్నారు. ప్రతి గ్రామానికి న్యాయం జరగాలని కోరారు.