కర్ణాటక కేబినెట్ : సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ శాఖలివే..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-27 13:54:52.0  )
కర్ణాటక కేబినెట్ : సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ శాఖలివే..?
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక కేబినేట్ కొలువు దీరిన విషయం తెలిసిందే. అయితే ఎవరికీ ఏయే శాఖలు కేటాయించనున్నారు అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. సిద్ధరామయ్య కీలక శాఖలను తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలిసింది. ఆర్థిక శాఖ, కేబినెట్ వ్యహహారాలు, ఇంటెలిజెన్స్, సమాచార శాఖ, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ రిఫామ్స్ డిపార్ట్‌మెంట్ తన వద్దే ఉంచుకోనున్నారు. డీకే శివకుమార్‌కు భారీ, మధ్య తరగతి నీటిపారుదల శాఖ, బెంగళూరు నగర అభివృద్ధి శాఖలను అప్పగించనున్నట్లు తెలిసింది. పార్టీ ముఖ్య నేత జీ.పరమేశ్వరకు హోం శాఖ, మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే కు డెవలప్ మెంట్, పంచాయతీ రాజ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది.

Also Read..

బీజేపీ తీరుతో ప్రమాదకర స్థితిలో భారత్: కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ ఫైర్

Advertisement

Next Story