Kargil : ఇండియా గేట్ వద్ద మహిళా అగ్నివీర్‌ల డ్రిల్

by Hajipasha |   ( Updated:2024-07-26 18:09:52.0  )
Kargil : ఇండియా గేట్ వద్ద మహిళా అగ్నివీర్‌ల డ్రిల్
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా అమర సైనికులకు నివాళులర్పిస్తూ శుక్రవారం రోజు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద భారత వాయుసేనకు చెందిన ‘అగ్నివీర్ వాయు’ మహిళా విభాగం డ్రిల్ నిర్వహించింది. ఈ పరేడ్‌లో అగ్నివీర్‌వాయు విభాగంలోని 29 మంది యువతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా డ్రిల్‌లో పాల్గొన్న మహిళా అగ్నివీరులు మీడియాతో మాట్లాడుతూ.. అగ్నివీర్ శిక్షణ గురించి, తమ కుటుంబాల నేపథ్యాల గురించి వివరించారు. చిన్నప్పటి నుంచి వాయుసేనలో చేరాలనే తమ స్వప్నం.. అగ్నివీర్‌వాయు రిక్రూట్‌మెంట్ వల్ల సాకారమైందన్నారు. శారీరక, మానసిక వికాసానికి బాటలు వేసేలా అగ్నివీర్ శిక్షణ ఉందని వారు తెలిపారు.

Advertisement

Next Story