Kangana Ranaut : అధికార కుర్చీ కోసమే రాహుల్‌‌గాంధీ తాపత్రయం : కంగనా రనౌత్

by Hajipasha |   ( Updated:2024-08-28 15:31:04.0  )
Kangana Ranaut : అధికార కుర్చీ కోసమే రాహుల్‌‌గాంధీ తాపత్రయం : కంగనా రనౌత్
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ విమర్శలు గుప్పించారు. ‘‘రాహుల్‌గాంధీ పద్ధతి లేని వ్యక్తి. ఆయన నిత్యం అధికార కుర్చీ కోసం పాకులాడుతుంటారు. ప్రతిసారీ తన దారిని మార్చుకుంటుంటారు’’ అని ఆమె ధ్వజమెత్తారు. తనకంటూ ఒక వ్యక్తిగత పంథా లేని నాయకుడిగా రాహుల్ మిగిలిపోయారని కంగన ఎద్దేవా చేశారు.‘‘రాహుల్ గాంధీ ప్రసంగాల్లో, ప్రవర్తనలో ఎక్కడా పద్ధతి అనేది మచ్చుకు కూడా కనిపించదు’’ అని వ్యాఖ్యానించారు. ఆయనకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలంటూ ఈసందర్భంగా కంగన వివాదాస్పద కామెంట్ చేశారు.

తాను ఇందిరాగాంధీ పాత్రలో నటించిన ‘ఎమర్జెన్సీ’ మూవీపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీని దేశంలో ఎంతమందైతే అభిమానించారో.. అంతేమంది ద్వేషించారని కంగన పేర్కొన్నారు. ఇందిర పాలనా కాలానికి సంబంధించిన చీకటి కోణాలు చాలానే ఉన్నాయన్నారు. ఇందిరాగాంధీని సోషలిస్టు అని అనుకోవడం సరికాదని చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూతో పోలిస్తే ఇందిరాగాంధీ రాజకీయ విధానాలు, సైద్ధాంతిక భావజాలాలు పూర్తిగా భిన్నమైనవని కంగన అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed