Kangana Ranaut : ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ బోర్డు అనుమతిలో జాప్యంపై కంగన కీలక ప్రకటన

by Hajipasha |   ( Updated:2024-08-31 14:18:23.0  )
Kangana Ranaut : ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ బోర్డు అనుమతిలో జాప్యంపై కంగన కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : త్వరలో విడుదల కానున్న ‘ఎమర్జెన్సీ’ మూవీపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. ఆ సినిమాకు ప్రాథమికంగా క్లియరెన్స్ లభించినప్పటికీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఇంకా హోల్డ్‌లోనే ఉంచిందని తెలిపారు. ఈమేరకు వివరాలతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. సెన్సార్ బోర్డుకు చెందిన సభ్యులకు ప్రాణహాని వార్నింగ్‌లు వచ్చినందు వల్లే తన సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్ లభించడంలో జాప్యం జరుగుతోందని ఆమె కామెంట్ చేశారు.

‘‘ఇందిరాగాంధీ హత్యోదంతాన్ని సినిమాలో చూపించకూడదని మాపై ఒత్తిడి పెంచుతున్నారు. భింద్రన్ వాలేను చూపించకూడదని అంటున్నారు. పంజాబ్ అల్లర్లపై సీన్లు ఉండకూడదని చెబుతున్నారు. మరి.. సినిమాలో ఏం చూపించాలో నాకు అర్థ కావడం లేదు. ఇది నాకు పెద్ద కష్టకాలం. దేశంలో ఇలాంటి పరిస్థితి ఉన్నందుకు బాధేస్తోంది’’ అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ మూవీలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్‌గానూ కంగన వ్యవహరించారు.

Advertisement

Next Story

Most Viewed