- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ కంచుకోట అయిన.. మండి నుంచి పోటీ చేస్తున్న కంగనా.. శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో.. అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజలను దోపిడి చేస్తోందని, తప్పుడు వాగ్దానాల ద్వారా వారిని ఆకర్షిస్తోందని రనౌత్ ఆరోపించారు.
కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలు, ప్రజలను మభ్య పెడుతోంది
మండిలో మద్దతుదారులను ఉద్దేశించి కంగనా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్‌ను ప్రశ్నించారు. వారు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ దోచుకోవడం తప్ప కాంగ్రెస్ ఏం చేస్తోంది? ఈ రోజు ఇక్కడ ఉన్న అక్కాచెల్లెళ్లు, తల్లులందరికీ రూ.1500 ఇస్తారా అని వాళ్లను అడగాలనుకుంటున్నాను. ఆ డబ్బు ఏమైంది? 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? బూటకపు వాగ్దానాలు చేసి ప్రజలను ఎందుకు ఆకర్షిస్తున్నారు? ఇలాంటి రాజకీయాలు ఎప్పటి వరకు సాగుతాయి?. కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల పట్ల హిమాచల్ ప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బదులుగా ప్రధాని నరేంద్ర మోదీ 'న్యూ ఇండియా' విజన్‌కు మద్దతివ్వాలని రనౌత్ కోరారు.