కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ యాక్సిడెంట్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

by Rajesh |
కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ యాక్సిడెంట్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కంచన్ జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైన్ యాక్సిడెంట్‌ల నుంచి రక్షణ కల్పించే ఆటోమెటిక్ వ్యవస్థ(ఏటీపీ) అందుబాటులోకి వచ్చే వరకు వందే భారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల గరిష్ట వేగాన్ని 160 కిలో మీటర్ల నుంచి 130 కిలో మీటర్లకు తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిజాముద్దీన్- ఆగ్రా మధ్య ఒక గతిమాన్ ఎక్స్ ప్రెస్, రెండు వందేభారత్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా.. ఏటీపీ వ్యవస్థ స్టార్ట్ అయ్యే వరకు వీటి వేగాన్ని 130 కిలో మీటర్లకు కుదించారు. రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సిగ్నల్) ఎన్‌సీఆర్ జోన్ జనరల్ మేనేజర్ కి లేఖ జారీ చేసి రైళ్ల వేగాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఐఆర్-ఏటీపీ కవచ్ విభాగంలో పనులు వేగవంతం చేయాలని, ఏటీపీ సిస్టమ్ పనిచేసే వరకు రైళ్ల వేగాన్ని గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో నడపాలని నిర్ణయించినట్లు లేఖలో తెలిపారు.

Next Story