US Elections: పిరికివాళ్లే అలా మాట్లాడతారు

by Shamantha N |
US Elections: పిరికివాళ్లే అలా మాట్లాడతారు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డెమొక్రటిక్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థులు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే, ఇటీవలే కమలాపై ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేశారు. అయితే, దీనిపై కమలా స్పందించారు. తన రన్నింగ్‌మేట్‌ టిమ్‌ వాజ్‌తో కలిసి పెన్సిల్వేనియా ర్యాలీలో కమలాహారిస్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె తన ప్రత్యర్థి ట్రంప్‌ (Donald Trump)పై విరుచుకుపడ్డారు. పిరికివాళ్లే అలా మాట్లాడతారని అన్నారు. రాజకీయాల్లో వక్రబుద్ధి కన్పిస్తోందని అన్నారు. ఎదుటివారిని దెబ్బకొట్టడం అనేది ఒక నాయకుడి చతురత మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల జీవితాల బాగు కోసం ఆలోచించేవారే నిజమైన నాయకులని అన్నారు. ఇతరులను తక్కువ చేసి చేసి మాట్లాడే వారంతా తన దృష్టిలో పిరికివాళ్లే అని ఆమె మండిపడ్డారు.

హ్యారిస్ పై ట్రంప్ విమర్శలు

ఇటీవలే సెన్సిల్వేనియా సభలో ట్రంప్‌ మాట్లాడుతూ.. హ్యారిస్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆమె భయంకరంగా నవ్వుతారని, ఆమె నవ్వుపై నిషేధం ఉందని, అందుకే ఆమె నోరు మూసుకుని తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలోనూ ట్రంప్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే, అమెరికా ఎన్నికలపై పలు సర్వేలు విడుదలవుతున్నాయి. వాషింగ్టన్ పోస్ట్- ఏబీసీ న్యూస్ ఐపీఎస్ఓఎస్ నిర్వహించిన సర్వేలో కమలా హ్యారిస్ ముంజలో ఉన్నారు. ఈ పోల్‌లో ఆమెకు 49శాతం మంది మద్దతు ప్రకటించగా.. ట్రంప్ నకు కేవలం 45 శాతం మద్దతుతో ఉన్నట్లు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed