కాంగ్రెస్‌లో Kamal Haasan పార్టీ విలీనం!

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-28 07:07:27.0  )
కాంగ్రెస్‌లో Kamal Haasan పార్టీ విలీనం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌కు హ్యాకర్లు షాకిచ్చారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేలా కమల్ హాసన్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వెబ్ సైట్ సైబర్ ఎటాక్‌కు గురైంది. ఈ విషయాన్ని మక్కల్ నీది మయ్యమ్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆ పార్టీ నేతలు కన్ఫర్మ్ చేశారు. కమల్ హాసన్ ప్రారంభించిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయిందంటూ పార్టీ వెబ్ సైట్‌లో ప్రత్యక్షం కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల నిమిత్తం జనవరి 30న మక్కల్ నీది మయ్యం అఫీషియల్‌గా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవబోతోందని ఓ సందేశం వెబ్ సైట్‌లో దర్శనమిచ్చింది.

అయితే కమల్ హాసన్ నుంచి ఎలాంటి ప్రకటన రాకుండానే వెబ్‌సైట్‌లో విలీనం సంగతి కనిపించడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇటీవల వరుసగా కాంగ్రెస్‌కు అనుకూలంగా కమల్ హాసన్ వ్యాఖ్యలు చేయడం, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడవడంతో విలీనం ప్రక్రియ నిజమేనేమో అనే అనుమానాలు రేకెత్తాయి. అయితే ఈ విషయం గ్రహించిన పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. ఇదంతా హ్యాకర్ల పనే అని గ్రహించి జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ప్రజాస్వామ్య గొంతుకను అణిచివేయాలనుకునే వారు తమ పార్టీ అధికారిక వెబ్ సైట్‌ను హ్యాక్ చేశారని, ఇలాంటి వాటికి తాము భయపడేది లేదన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారికి తగిన సమాధానం చెబుతామని ఎంఎన్ఎం పార్టీ నేతలు ట్విట్టర్‌లో వెల్లడించారు.

Also Read...

PM Narendra Modi పూర్తి పేరు తెలుసా...?

Advertisement

Next Story

Most Viewed