- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను లొంగిపోను.. వీడియో రిలీజ్ చేసిన ఖలిస్తానీ నేత అమృతపాల్ సింగ్
దిశ, వెబ్ డెస్క్: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృతపాల్ సింగ్ గత 13 రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే అమృతపాల్ సింగ్ లొంగిపోతున్నాడు అంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలకు అమృతపాల్ సింగ్ ఫుల్ స్టాప్ పెట్టాడు. తాను లొంగిపోవడం లేదంటూ యూట్యూబ్ లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. పంజాబీ సిక్కుల కోసం ప్రత్యేక దేశాన్ని సాధించేదాక తన ఉద్యమాన్ని ఆపేది లేదంటూ ఆ వీడియోలో తెలిపాడు. కాగా.. వారిస్ పంజాబ్ దే సంస్థ అధ్యక్షుడిగా ఉంటూ ప్రత్యేక దేశం పేరుతో అమృతపాల్ సింగ్ హింసను ప్రేరేపిస్తున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులతో అంటకాగుతూ దేశద్రోహానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలు అతడిని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగాయి. అయితే అమృతపాల్ సింగ్ రకరకాల మారు వేషాలతో పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ హైకోర్టు అక్కడి పోలీసు శాఖకు మొట్టికాయలు వేసింది. 80 వేల మంది పోలీసులు ఒక్క వ్యక్తని పట్టుకోలేకపోతున్నారా అంటూ ప్రశ్నించింది.