- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అత్యాచారం కేసులో సజ్జన్ జిందాల్‌కు విముక్తి
దిశ, నేషనల్ బ్యూరో: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఎస్‌డబ్ల్యు స్టీల్ ఎండి సజ్జన్ జిందాల్‌కు ఉపశమనం లభించింది. ఈ కేసులో ఆయనను ఇరికించేందుకు ఫిర్యాదు దారు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు కేసు మూసివేతకు సంబంధించి నివేదికను దాఖలు చేశారు. నివేదిక ప్రకారం, మహిళపై సజ్జన్ జిందాల్ అత్యాచారం చేశాడనేది అవాస్తవం, ఆ రోజు జిందాల్ హోటల్‌కు వెళ్లలేదని హోటల్ సిబ్బంది నిర్ధారించారని, సాక్ష్యాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసును మూసివేయాలని పోలీసులు కోర్టులో నివేదికను దాఖలు చేశారు.
గతంలో సజ్జన్ జిందాల్‌పై 30 ఏళ్ల వైద్యురాలైన మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది. 2021లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఆయనను కలిశానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2022, జనవరి 24న తనపై అత్యాచారం చేశాడని మహిళ పేర్కొంది. అయితే దీనిపై ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదని పేర్కొంటూ, నేరుగా కోర్టును ఆశ్రయించగా ముంబై పోలీసులు సజ్జన్ జిందాల్‌పై కేసు నమోదు చేశారు.
అయితే దీనిపై సజ్జన్ జిందాల్ స్పందిస్తూ తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఆమె చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి, విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. విచారణ చేపట్టిన అనంతరం తాజాగా పోలీసులు మహిళ ఆరోపిస్తున్న విధంగా సజ్జన్ జిందాల్ ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారించి, కేసును మూసి వేయాల్సిందిగా కోర్టులో నివేదికను దాఖలు చేశారు.