Kharge: ఈ కుంభకోణంపై జేపీసీ విచారణ జరపాలి.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ట్వీట్

by Ramesh Goud |
Kharge: ఈ కుంభకోణంపై జేపీసీ విచారణ జరపాలి.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ భారీ కుంభకోణంపై జేపీసీ విచారణ జరపాలని, దీనిపై విచారణ జరగనంతవరకు మోడీ తన ఏ1 స్నేహితుడికి సహాయం చేస్తూనే ఉంటారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. హిండన్ బర్గ్ ఆరోపణలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. హిండెన్‌బర్గ్‌ విషయంలో జనవరి 2023లో సుప్రీంకోర్టు ముందు సెబీ, మోదీజీ ప్రాణ స్నేహితుడు అదానీకి క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశాడు. నేడు ఆర్ధిక సంబందాలకు అధినేతగా చెప్పుకునే అదే సెబీ బండారం బట్టబయలయ్యిందని అన్నారు. మధ్యతరగతికి చెందిన చిన్న మరియు మధ్యతరగతి పెట్టుబడిదారులు, వారు కష్టపడి సంపాదించిన డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతుంటారని, వారు సెబీని విశ్వసిస్తున్నందున వారికి రక్షణ అవసరమని చెప్పారు. ఈ భారీ కుంభకోణంలో జాయింట్ పార్లమెంట్ కమిటీ విచారణ జరగనంత వరకు, మోడీ జి తన ఏ1 స్నేహితుడికి సహాయం చేస్తూనే ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక దేశంలోని రాజ్యాంగ సంస్థలు కూడా నాశనం అవుతూనే ఉంటాయని ఖర్గే ఎక్స్ లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed