రాజ్యసభ సభ్యత్వానికి జేపీ నడ్డా రాజీనామా

by GSrikanth |   ( Updated:2024-03-04 15:38:15.0  )
రాజ్యసభ సభ్యత్వానికి జేపీ నడ్డా రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీజేజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం తన రాజీనామాను రాజ్యసభ సెక్రటరీ ఆమెదించారు. కాగా, ఇటీవలే లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో మొత్తం 195 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తారని జాబితాను విడుదల చేసిన బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే తెలిపారు. గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతీ ఇరానీ, కాంతీ నుంచి సువేందు అధికారి, ఫతేపూర్ నుంచి సాథ్వీ నిరంజన్ జ్యోతి, మధుర నుంచి హేమా మాలిని పోటీ చేస్తున్నారు.

Advertisement

Next Story