జేపీ నడ్డా రాజీనామా.. ఎందుకో తెలుసా?

by Swamyn |
జేపీ నడ్డా రాజీనామా.. ఎందుకో తెలుసా?
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రాజ్యసభ పార్లమెంటరీ బులెటిన్ వెల్లడించింది. ‘‘హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జేపీ నడ్డా.. తన పదవికి రాజీనామా చేశారు. దీనికి రాజ్యసభ చైర్మన్ ఆమోదం తెలిపారు. ఇది సోమవారం నుంచే అమల్లోకి వస్తుంది’’ అని రాజ్యసభ పార్లమెంటరీ తన ప్రకటనలో పేర్కొంది. కాగా, ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి పోటీ చేసిన నడ్డా.. ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హిమాచల్ ప్రదేశ్ సభ్యత్వాన్ని వదులుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని మొత్తం 57 స్థానాల్లోని రాజ్యసభ సభ్యుల గడువు ఏప్రిల్‌లో ముగియనుంది. ఈ క్రమంలోనే తాజాగా రాజ్యసభ ఎన్నికలు నిర్వహించారు. జేపీ నడ్డా 2012 నుంచి రాజ్యసభలో హిమాచల్ ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అక్కడ బీజేపీ మెజార్టీ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే నడ్డా బీజేపీ పాలిత గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేశారు.


Advertisement

Next Story