Jp nadda: ప్రపంచ ఆరోగ్య భద్రతకు భారత్ సహకారం.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా

by vinod kumar |
Jp nadda: ప్రపంచ ఆరోగ్య భద్రతకు భారత్ సహకారం.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ ఆరోగ్య భద్రతను పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. శాశ్వత ఆరోగ్య పరిష్కారాలను రూపొందించడానికి వివిధ రంగాల మధ్య సహకారం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) నిర్వహిస్తున్న19వ అంతర్జాతీయ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీల సదస్సును నడ్డా సోమవారం ప్రారంభించారు. కొవిడ్ టైంలో భారత్ గ్లోబల్ లీడర్ గా అవతరించిందని కొనియాడారు. వ్యాక్సిన్‌ను వేగంగా ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు అందించిందని తెలిపారు. వసుదైక కుటుంబం అనే సూత్రంతో స్పూర్తి పొంది,,150 కంటే ఎక్కువ దేశాలకు అవసరమైన మందులు, టీకాలు, వైద్య సామగ్రిని అందజేశామన్నారు.

ప్రపంచ ఆరోగ్య భద్రత, స్థిరత్వానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి దేశాల మధ్య సహకారాన్ని ఎలా మెరుగుపర్చుకోవాలో చర్చించడానికి సదస్సు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. దేశంలో సురక్షితమైన, నాణ్యమైన మందులు, వైద్య పరికరాలను ఆమోదించడానికి , 200 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయడానికి సీడీఎస్సీవో గట్టి వ్యవస్థను అభివృద్ధి చేసిందని తెలిపారు. సీడీఎస్సీఓలో ప్రస్తుతం 95 శాతానికి పైగా ప్రక్రియలు డిజిటలైజ్ చేయబడ్డాయని, దాని ద్వారా పారదర్శకత, వాటాదారుల మధ్య నమ్మకాన్ని పెంచుతున్నాయన్నారు. కాగా, ఐదు రోజుల పాటు నిర్వహించినున్న సమావేశానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్లూహెచ్ఓ)లో సభ్యత్వం పొందిన194 దేశాల నుంచి నిపుణులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed