- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jp nadda: కాంగ్రెస్ అర్బన్ నక్సల్స్‌కు అధికార ప్రతినిధిగా మారింది.. బీజేపీ చీఫ్ నడ్డా
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు. అర్బన్ నక్సల్స్‌కు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మారిందని విమర్శించారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఒడిశాలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం వాదించే వారితో కాంగ్రెస్ జతకట్టిందని, జాతీయవాదాన్ని మరచిపోయిందని మండిపడ్డారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మా గాంధీ సూచించారని, కానీ ఆ సిఫార్సును జవహర్‌లాల్ నెహ్రూ పట్టించుకోలేదని తెలిపారు.
వామపక్ష పార్టీలకు దిశానిర్దేశం లేదని కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో తరచూ అంతర్గత పోరుకు పాల్పడుతున్నారన్నారు. ఢిల్లీలో కేవలం ఫొటో అవకాశాల కోసం మాత్రమే ఏకమయ్యారని ఎద్దేవా చేశారు. ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేయకుండా, ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులను కాంగ్రెస్ పార్టీ హరించిందన్నారు. మహిళా సాధికారతకు ప్రధాని మోడీ చేసిన కృషిని ప్రశంసించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు చేసిన విమర్శలపై నడ్డా స్పందిస్తూ..భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, బొమ్మలు, మొబైల్‌లను ఎగుమతి చేయడంలో అగ్రస్థానంలో ఉందన్నారు. గాంధీలకు ఆర్థిక సమస్యలపై అవగాహన లేదని ఫైర్ అయ్యారు.