ఇండియన్ రైల్వేలో 2.74 లక్షల ఉద్యోగాలు

by Seetharam |   ( Updated:2023-06-29 15:21:29.0  )
ఇండియన్ రైల్వేలో 2.74 లక్షల ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ రైల్వేలో ఇప్పటివరకు దాదాపు 2.74 లక్షల గ్రూప్ సి ఉద్యోగ ఖాళీలున్నాయి. వీటిలో సెక్యూరిటీతో ముడిపడిన ఉద్యోగాలు 1.77 లక్షల వరకు ఉన్నాయి. మధ్య ప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు చట్టం ఉద్యమకర్త చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తుపై రైల్వే ఈ వివరాలు వెల్లడించింది. గతేడాది డిసెంబరులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటుకు సమాధానమిస్తూ రైల్వేలో నాన్ గెజిటెడ్ పోస్టులు 3.12 లక్షల మేర ఖాళీలు ఉన్నాయని చెప్పారు. నియామకాలు, పదోన్నతుల ద్వారా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ నాటికి 1.52 లక్షల ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story