13న విచారణకు రండి.. ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు

by Hajipasha |
13న విచారణకు రండి.. ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ విచారణకు పిలిచింది. జనవరి 11న విచారణకు హాజరుకావాలని ఇచ్చిన సమన్లను ఆయన దాటవేశారు. దీంతో మంగళవారం (ఫిబ్రవరి 13) శ్రీనగర్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని మరోసారి ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు ఇచ్చింది. ఈ కేసులో తొలిసారిగా 2022 సంవత్సరంలో అబ్దుల్లాపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2001 నుంచి 2012 మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించారు. ఆ టైంలో క్రికెట్ అసోసియేషన్‌‌కు చెందిన దాదాపు రూ.43.6 కోట్లను వివిధ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం ద్వారా స్వాహా చేశారనే అభియోగాలను ఫరూక్ అబ్దుల్లా ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఈ ఆరోపణలతో 2018 సంవత్సరంలోనే సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలోని మనీలాండరింగ్ కోణంపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed