Richest Candidate: జార్ఖండ్‌లో సంపన్న అభ్యర్థిగా అఖీల్ అఖ్తర్.. రూ.400 కోట్ల స్థిరాస్తులు

by Hajipasha |
Richest Candidate: జార్ఖండ్‌లో సంపన్న అభ్యర్థిగా అఖీల్ అఖ్తర్.. రూ.400 కోట్ల స్థిరాస్తులు
X

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల(Jharkhand polls) రెండో విడత పోలింగ్ ఈనెల 20న జరగబోతోంది. ఈ విడతలో అత్యంత ధనిక అభ్యర్థి(Richest Candidate)గా అఖీల్ అఖ్తర్(Aquil Akhtar) నిలిచారు. పాకూర్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అఖీల్ అఖ్తర్ తనకు రూ.400 కోట్లకుపైగా విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయని ప్రకటించారు. దాదాపు రూ.99 లక్షలు విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈవివరాలను ఆయన వెల్లడించారు.

ఇక సంపదపరంగా రెండోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి నిరంజన్ రాయ్ ఉన్నారు. రూ.137 కోట్ల ఆస్తులు కలిగిన ఈయన ధన్వార్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ధన్వార్ స్థానం నుంచే పోటీ చేస్తున్న ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీ రామ్) అభ్యర్థి మహ్మద్ దానిష్ సంపదపరంగా మూడో స్థానంలో నిలిచారు. ఈయన ఆస్తుల విలువ దాదాపు రూ.32 కోట్లు. మహేశ్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న జార్ఖండ్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి ఎలియాన్ హన్స్‌దాక్ తనకు ఒక్కరూపాయి కూడా ఆస్తి లేదని ప్రకటించారు. రెండో విడతలో మొత్తం 38 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. 32 మంది బీజేపీ అభ్యర్థులు కోటీశ్వరులే. 90 శాతం మంది జేఎంఎం అభ్యర్థులు, 83 శాతం మంది కాంగ్రెస్ అభ్యర్థులు కూడా కోటీశ్వరులే.

Advertisement

Next Story