తాగడానికి నీళ్లడిగాడని దివ్యాంగుడిని చితకబాదిన జవాన్లు (వీడియో)

by Javid Pasha |
తాగడానికి నీళ్లడిగాడని దివ్యాంగుడిని చితకబాదిన జవాన్లు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన జవాన్లు దారుణంగా ప్రవర్తించారు. తాగడానికి నీళ్లడిగాడనే కారణంగా ఓ దివ్యాంగుడిని జవాన్లు కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో శనివారం రాత్రి సచిన్ సింగ్ అనే దివ్యాంగుడు తన ట్రై సైకిల్ మీద వెళ్తున్నాడు. అతడికి దాహం వేయడంతో అటుగా వెళ్తున్న ఇద్దరు ప్రాంతీయ రక్షక్ దళ్ (పీఆర్డీ) జవాన్లను మంచి నీళ్లు ఇవ్వాలని అడిగాడు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు జవాన్లు.. తమనే నీళ్లు అడుగుతావా అంటూ అతడిని తీవ్రంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో జవాన్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు జవాన్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed