జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్‌ను నిషేధించిన ప్రభుత్వం

by S Gopi |
జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్‌ను నిషేధించిన ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: చట్టవిరుద్ధ కార్యకలాపాల(నివారణ) చట్టం కింద నయీమ్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలోని జమ్మూ కశ్మీర్ నేషనల్ ఫ్రంట్‌(జేకేఎన్ఎఫ్)ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిషేధించింది. జేకేఎన్ఎఫ్ దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రతకు విఘాతం కలిగించే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతోందని హోం మంత్రిత్వ శాఖ తన ఆర్డర్‌లో పేర్కొంది. జేకేఎన్ఎఫ్ సభ్యులు జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాదనికి ఆజ్యం పోసేందుకు, దేశ భూభాగంలో ఉగ్రవాదులకు మద్దతును అందిస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు, భారత వ్యతిరేక ప్రచారానికి తోడ్పడుతున్నారని తెలిపింది. కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో హింసాత్మక నిరసనకారులను సమీకరించడం, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్డటం, భద్రతా బలగాలపై రాళ్ల దాడికి పాల్పడుతున్నారని ప్రభుత్వం పేర్కొంది. జేకేఎన్ఎఫ్‌పై నిషేధం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుందని హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed