- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ మూడింట ఒక వంతు ప్రధాని మాత్రమే.. NDA కూటమిపై జైరాం రమేష్ సెటైర్స్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సెటైర్స్ వేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024 లోక్ సభ ఎన్నికలు మోడీకి పరాజయాన్ని అందించాయని అన్నారు. ఇప్పుడు మోడీ మూడింట ఒక వంతు ప్రధాని మాత్రమేనని సెటైర్ వేశారు. ఎన్డీఏ అంటే నరేంద్ర, నాయుడు, నితీష్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. ఈ ముగ్గురు నేతలు ప్రధాని కుర్చీ కోసం పాకులాడుతున్నారని అన్నారు. కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు మాత్రమే సాధించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు చాలా దూరంలో నిలిచిపోయింది. ఈ పరిణామాల వల్ల బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మిత్రపక్షాల మద్దతు అనివార్యమైంది. దీంతో ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జేడీ(యూ) కీ రోల్ పోషించనున్నాయి.